విద్యుత్తు తీగ తెగిపడి బాలుడి మృతి

కంగ్టి, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగ తెగి వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్‌(బి)లో మంగళవారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ ఈశ్వర్‌గౌడ్‌, సర్పంచి రాజ్‌కుమార్‌ పాటిల్‌ తెలిపిన వివరాల ప్రకారం....నాగూర్‌(బి) గ్రామానికి చెందిన బాలప్ప- నిర్మల దంపతుల కుమారుడు శివరాం(9)  వీధిలో ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో వీచిన గాలికి విద్యుత్తు తీగ తెగి బాలుడిపై పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్తు సరఫరా చేసే నియంత్రిక వద్ద కరెంటు సరఫరాను నిలిపివేశారు. అప్పటికే బాలుడికి విద్యుదాఘాతానికి గురవడంతో స్థానిక వైద్యుడికి చూపించగా...మృతిచెందినట్లు పేర్కొనడంతో కుటుంబీకులు బోరున విలపించారు. గ్రామంలో దశాబ్దాల కిందట అమర్చిన విద్యుత్తు స్తంభాలు, తీగలు శిథిలావస్థకు చేరాయని, వాటిని మార్చాలని గతంలో ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అభంశుభం తెలియని చిన్నారి ప్రాణం పోయిందని గ్రామస్థులు ఆరోపించారు.


మరిన్ని

ap-districts
ts-districts