చీకోటి ప్రవీణ్‌ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: తనకు పోలీసు భద్రత కల్పించాలంటూ క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నమోదు చేసిన మనీ లాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్‌ ఇచ్చిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ప్రవీణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. క్యాసినో, మనీ లాండరింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయంగా ఈడీ కేసు నమోదు చేసిందని రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనల అనంతరం పిటిషనర్‌ దరఖాస్తుపై జీవో 655 ప్రకారం వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని