‘అగ్నిపథ్‌ కేసు’ భయం.. యువకుడి ఆత్మహత్య

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: అగ్నిపథ్‌కు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళన నిర్వహించిన అభ్యర్థుల వెంట ఉన్న తనపైనా కేసు నమోదవుతుందేమోననే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర ఎస్సై మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..

నిర్మల్‌ జిల్లా తానూరు మండలం బెల్‌తరోడకు చెందిన మహేష్‌(25) నిజామాబాద్‌లో ఉంటూ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రెండు రోజుల క్రితం చరవాణి ద్వారా బాసర గోదావరి నది దగ్గర ఉన్నానని చెప్పి కుటుంబ సభ్యులకు సందేశం పంపించాడు. దీంతో వారు  అక్కడకు వచ్చి వెతికినా ఆచూకీ దొరకలేదు. గురువారం మొదటి స్నాన ఘాట్‌ వద్ద అతడి శవాన్ని గుర్తించిన స్నేహితులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. కొన్ని రోజుల నుంచి అగ్నిపథ్‌ విషయమై తనపై కేసు నమోదవుతుందని ఆందోళన చెందుతున్నాడని, ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts