ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి చిన్నారి మృతి

ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్రలోని వసాయ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తూర్పు వసాయ్‌లోని రాందాస్‌ నగర్‌కు చెందిన షానవాజ్‌ అన్సారీ.. సెప్టెంబరు 23వ తేదీ తెల్లవారుజామున తన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. అనంతరం ఇంట్లో అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల సమయంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న షానవాజ్‌ అన్సారీ కుమారుడు షబ్బీర్‌, తల్లి రుక్సాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షబ్బీర్‌ మరణించాడు.


మరిన్ని

ap-districts
ts-districts