ఎన్నిసార్లు పెళ్లయ్యింది?

సహ చట్టం కింద అధికారిణి వివరాలు కోరిన వ్యక్తి అరెస్టు

కోలారు, న్యూస్‌టుడే: ఒక మహిళా తహసీల్దారుకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలపాలని కోరుతూ పలు ప్రశ్నల్ని సంధించిన మండికల్‌ నాగరాజ్‌ అనే వ్యక్తిని కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముళబాగిలుకు చెందిన నాగరాజ్‌ సంబంధిత తహసీల్దారును లక్ష్యంగా చేసుకుని మీకు ఎన్నిసార్లు వివాహమైంది? ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నారు? ప్రస్తుతం ఎవరితో సంసారం చేస్తున్నారు? చివరి వివాహం ఎక్కడైంది? దానికి శుభలేఖ ఉందా? కల్యాణమండపం వివరాలు చెబుతారా? అంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. మహిళా తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముళబాగిలు పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని