ఆస్తి కోసం 72 ఏళ్ల భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భార్య

ఆస్తి కోసం 72 ఏళ్ల వృద్ధుడిపై అతని భార్య కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. షాలీమార్‌బాగ్‌ ప్రాంతంలో ఓ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా వారి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగేవి. వారికి ఉన్న ఇళ్లలో ఒకదాన్ని అమ్మి.. మరో ఆస్తిని కొనుగోలు చేశాడా వృద్ధుడు. కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తిని తన పేరున రిజిస్టర్‌ చేయాలని అతని భార్య కోరింది. అందుకు నిరాకరించిన వృద్ధుడు తన పేరు పైనే రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఈ నెల 21న.. భర్తపై ఉన్న కోపంతో అతను నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టింది ఆ మహిళ. అదే ఇంట్లోని పై భాగంలో ఉంటున్న వారి కుమారుడు, కోడలు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. వృద్ధుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని