
ఆల్ఫాజియో కంపెనీపై ఈడీ కొరడా
రూ.16 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తు
హవాలా మార్గంలో దుబాయ్‌కు సొమ్ము తరలించినట్లు గుర్తింపు
ఈనాడు, హైదరాబాద్: హవాలా మార్గంలో దుబాయ్‌కు సొమ్ము తరలించిన హైదరాబాద్‌కు చెందిన ఆల్ఫాజియో సంస్థపై ఈడీ కొరడా ఝళిపించింది. ఆ సంస్థకు చెందిన సుమారు రూ.16 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను బుధవారం జప్తు చేసింది. దేశవిదేశాల్లో ఆయిల్ ఉత్పత్తుల కంపెనీలకు సీస్మిక్ సర్వే సేవలందిస్తోన్న ఆల్ఫాజియో సంస్థ ఫెమా ఉల్లంఘనలకు పాల్పడుతోందనే సమాచారంతో ఈడీ చేపట్టిన దర్యాప్తులో అక్రమాలు వెలుగుచూడటంతో ఈ చర్యలు చేపట్టింది. సీస్మిక్ సర్వే కోసం విదేశాల నుంచి తెప్పిస్తున్నట్లు చూపించిన ఈ సంస్థ.. చెల్లింపుల పేరిట అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దుబాయ్‌లో ఉంటున్న చార్టర్డ్ అకౌంటెంట్ రాజీవ్‌సక్సేనా నిర్వహిస్తున్న మాట్రిక్స్ గ్రూప్ డీఎంసీసీ సంస్థ ద్వారా విదేశీ సంస్థలకు చెల్లింపులు చేసినట్లు ఇన్వాయిస్లు సృష్టించినట్లు తేలింది. కానీ ఆ సొమ్మును ఆల్ఫాజియో సంస్థ ఛైర్మన్, ఎండీ దినేశ్ అల్లా వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు వెల్లడైంది. అలా ఫెమా నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా 25,34,628 డాలర్లను దుబాయ్‌కు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే అంత విలువైన ఆల్ఫాజియో సంస్థ ఎఫ్డీలను జప్తు చేసింది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/02/23)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా