
బ్యాంకు రుణం ఎగవేత కేసు.. పది మందికి జైలుశిక్ష, జరిమానా
ఈనాడు, హైదరాబాద్: బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం 10 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధించింది. వివరాలిలా ఉన్నాయి. 2012-13లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి 6 కంపెనీలకు రుణం మంజూరయింది. తప్పుడుపత్రాలతో ఆ కంపెనీలు బ్రాంచ్ సీనియర్ మేనేజర్ శరత్‌బాబు జెల్లితో కుమ్మక్కై రూ.5 కోట్ల రుణం పొందాయి. ఆ రుణం ఎగ్గొట్టడంతో బ్యాంకుకు సుమారు రూ.4.57 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారంపై 2013 మార్చి 30న కేసు నమోదు కాగా.. సీబీఐ 2014 ఆగస్టు 27న అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును విచారించిన సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించింది. శరత్‌బాబుతోపాటు బ్యాంకు అప్పటి అసిస్టెంట్ మేనేజర్ సుహాస్ కల్యాణ్ రాందాసికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.1.1 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రైవేటు వ్యక్తులు.. దొనికెన శ్రీధర్, పూర్ణశ్రీ, మారెల్ల శ్రీనివాసరెడ్డిలకు ఏడేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.లక్ష వంతున జరిమానా విధించింది. మారెల్ల లక్ష్మారెడ్డికి ఏడాది జైలు, రూ. 20 వేల జరిమానా; వెంపటి శ్రీనివాస్, వెట్టే రాజారెడ్డిలకు మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా; వడ్డే నర్సయ్య, బత్తుల సత్యసూరజ్రెడ్డిలకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. మావెన్ లైఫ్ సైన్సెస్ ప్రై.లిమిటెడ్, గ్రౌపెల్ ఫార్మా ప్రై.లిమిటెడ్, కాన్ఫెర్రో హెల్త్ ప్రై.లిమిటెడ్‌లకు రూ.లక్ష చొప్పున, హైదరాబాద్ టాబ్లెట్ టూల్స్, కిరణ్ ఇంపెక్స్, శ్రీవైష్ణవి ఫార్మా కెమ్‌కు రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 2,391 పోస్టుల భర్తీకి అనుమతి
-
General News
Pawan Kalyan: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
-
General News
Postal jobs: తపాలా శాఖలో 40,889 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?
-
India News
India-China: మరిన్ని ఘర్షణలు జరగొచ్చు : తాజా నివేదికలో ప్రస్తావన
-
India News
Padma Shri: ‘పద్మశ్రీ’ వరించినా.. పక్కా ఇల్లు మాత్రం రాలేదు..!