నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాకు అవసరం లేదు!

చింటు: భోజనం చేసే ముందు నాలాగే నువ్వూ దేవుడికి ప్రార్థిస్తావా?
బంటి: నాకు ఆ అవసరం లేదు చింటూ.. మా అమ్మ వంటలు బాగానే చేస్తుంది.
చింటు: ఆఁ!!

అంతేగా... అంతేగా..!

నాన్న: పరీక్షల్లో ఫెయిలై కూడా నవ్వుతున్నావేంటి కిట్టూ?
కిట్టు: నా పేపర్లో చూసి కాపీ కొట్టిన బిట్టూ గుర్తొచ్చి!
నాన్న: ఆఁ!!

భలే సమాధానం..

మాస్టారు: రేపు ఉదయం ఆరు గంటలకు కచ్చితంగా రావాలి. రాకుంటే ఏమవుతుందో తెలుసా?
సునీల్‌ : ఆరు దాటిపోతుంది సార్‌..

వెన్నెలంటే మాటలా?

టీచర్‌: వెన్నెలా.. రెండు కొమ్ములున్న జంతువుల పేర్లు చెప్పు?
వెన్నెల: కుక్క, గుర్రం

టీచర్‌: వాటికి కొమ్ములెక్కడున్నాయి?
వెన్నెల: కుక్కలో ‘కు’ అక్షరానికి, గుర్రంలో ‘గు’ అక్షరానికి కొమ్ములున్నాయి కదా టీచర్‌..

టీచర్‌: ఆఁ!!


ap-districts
ts-districts