అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ఉ’ అక్షరంతోనే ప్రారంభం అవుతాయి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


తమాషా ప్రశ్నలు

1. పిల్లలకు ఇష్టమైన దానం ఏంటి?

2. తినడానికి పనికిరాని పప్పు ఏది?

3. ఆడించలేని మర?


ఏంటో చెప్పగలరా?

ఇక్కడ ఒక కూరగాయ బొమ్మ ఉంది. అదేంటో చెప్పండి.


పదమేంటి?

ఇక్కడ కొన్ని బొమ్మలూ, ఆంగ్ల అక్షరాలూ ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న గణిత గుర్తుల ఆధారంగా వచ్చే పదమేంటో కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పన్ను’లో ఉన్నాను కానీ ‘దన్ను’లో లేను. ‘కోల’లో ఉన్నాను కానీ ‘గోల’లో లేను. ‘బండి’లో ఉన్నాను కానీ ‘బండ’లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘పాశం’లో ఉన్నాను కానీ ‘ఆకాశం’లో లేను. ‘మలుపు’లో ఉన్నాను కానీ ‘మదుపు’లో లేను. నేనెవరినో చెప్పగలరా?


పొడుపు కథలు  

1. ఇంటి లోపల నిప్పులు ఎగసినా, కోట మాత్రం చెక్కు చెదరదు. ఏంటది?

2. రెక్కలు లేవు కానీ ఎగురుతుంది.. కళ్లు లేవు కానీ బోరున ఏడుస్తుంది. అదేంటబ్బా?

3. ఆకుపచ్చని ఒళ్లు.. ఒళ్లంతా కళ్లు.. పండితే కళ్ల మధ్య చుక్కల జల్లు. ఏమిటో?


వాక్యాల్లో తీపి పదార్థాల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని తీపి పదార్థాల పేర్లు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం.  

1. హరీ.. ఎందుకా జాబిల్లి వైపే చూస్తూ కూర్చున్నావు?
2. అర్ధరాత్రి దాటినా ఇంకా పడుకోవా.. ఉదయాన్నే బడికి వెళ్లాలి కదా?
3. ఆ ఒక్కటీ రాసేస్తే.. పరీక్షలు సంపూర్ణం అయ్యేవి కదా!  
4. జహీరాబాదు, అలహాబాదు, షానవాజ్‌గంజ్‌ మీదుగా దిల్లీకి చేరుకున్నాం.
5. అందుకే.. సరిగ్గా చూసుకున్న తరవాతే దేన్నైనా కొనుక్కోవాలి.


జవాబులు

అక్షరాల చెట్టు :  INTERNATIONAL

పదవలయం : 1.ఉదరం 2.ఉదయం 3.ఉడత 4.ఉక్రోషం 5.ఉల్లాసం 6.ఉత్తరం 7.ఉసిరి 8.ఉరుము కవలలేవి? : 1, 4

తమాషా ప్రశ్నలు : 1.మైదానం 2.గన్నేరుపప్పు 3.పడమర

ఏంటో చెప్పగలరా? : కాకరకాయ

పదమేంటి? : 1. SUBMARINE 2. AEROPLANE 

నేనెవర్ని? : 1.పకోడి 2.పాలు

పొడుపు కథలు : 1.మట్టి పొయ్యి 2.మేఘం 3.సీతాఫలం వాక్యాల్లో తీపి పదార్థాల పేర్లు : 1.కాజా 2.కోవా 3.పూర్ణం 4.బాదుషా 5.కేసరి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని