నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మీరు అన్నారని!

టీచర్‌: వారం రోజుల నుంచి చూస్తున్నా.. ఒక చెవిలో దూది పెట్టుకుంటున్నావేం చింటూ.. చెవిపోటా?

చింటు: కాదు టీచర్‌.. ఈ చెవితో విన్నవి ఆ చెవితో వదిలేస్తున్నావు.. అని మీరంటున్నారని!

టీచర్‌: ఆఁ!!

నిజమే సుమా!

పండు: ఒక ఓవర్‌కు ఎన్ని బంతులు?

గుండు: ఒక ఓవర్‌కు ఆరు బంతులు.

పండు: కాదు ఒకే బంతి. ఓవరంతా ఒకే బంతితో వేస్తారుగా!

గుండు: ఆఁ!!

దటీజ్‌ కిట్టు!

నాన్న: అశోక చక్రవర్తి గొప్ప పాలకుడని ఎలా చెప్పగలవు?

కిట్టు: నోటితో నాన్నా!

నాన్న: ఆఁ!!

అంతేగా... అంతేగా...!

టీచర్‌: అన్నదానం, రక్తదానం లాంటివి ఇంకొన్ని చెప్పు?

బిట్టు: నిదానం, మైదానం టీచర్‌.


మరిన్ని

ap-districts
ts-districts