ఆన్‌లైన్‌ శిక్షణలు ఉన్నాయా?

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందించే సంస్థలున్నాయా? వివరాలు తెలుపగలరు.  

- పి. నూకరాజురెడ్డి

సివిల్స్‌, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 లాంటి పరీక్షలకు శిక్షణ ఎంత ముఖ్యమో ఆ శిక్షణ సంస్థ విశ్వసనీయత కూడా అంతే ముఖ్యం. సాధ్యమైనంతవరకు గ్రూప్స్‌/సివిల్స్‌ శిక్షణను ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం శ్రేయస్కరం. గ్రూప్స్‌/ సివిల్స్‌ శిక్షణలో తరగతి గదిలో నేర్చుకొనే సబ్జెక్టుతో పాటు, తోటి అభ్యర్ధుల నుంచీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ అవకాశం లేకపోతేనే ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకోండి. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ కారణంగా చాలా సంస్థలు ఆన్‌లైన్‌లో సివిల్స్‌/గ్రూప్స్‌ కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో నాణ్యమైన శిక్షణ అందించే సంస్థల నుంచే ఆన్‌లైన్‌ శిక్షణ పొందండి.
ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థ ఎంపికలో ఏ విషయాలు గమనించాలంటే.. 1. కంటెంట్‌ నాణ్యత 2. పరీక్షల నాణ్యత 3. వ్యక్తిగత శ్రద్ధ 4. విశ్లేషణాత్మక వీడియో పరిష్కారాలు 5. సాంకేతిక సేవలు 6. ఇతర అభ్యర్థులతో చర్చించగలిగే డిస్కషన్‌ ఫోరమ్‌ 7. అధ్యాపకుల విషయ పరిజ్ఞానం/ అనుభవం  8. నిరంతర ఆన్‌లైన్‌ సహాయం. వీటిని దృష్టిలో పెట్టుకొని గత రెండు, మూడు సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ శిక్షణ పొందినవారిని సంప్రదించి, వారి సూచనల ప్రకారం మంచి శిక్షణ సంస్థను ఎంచుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


మరిన్ని

ap-districts
ts-districts