నోటిఫికెషన్స్

కోస్ట్‌ గార్డులో అసిస్టెంట్‌ కమాండెంట్లు

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌... దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్‌ ‘ఎ’ గెజిటెడ్‌ ఆఫీసర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* జనరల్‌ డ్యూటీ (జీడీ) ఖీ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌: 50 పోస్టులు
* టెక్నికల్‌ (మెకానికల్‌) ఖీ టెక్నికల్‌ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌): 20 పోస్టులు
* లా ఎంట్రీ: 01 పోస్టు
అర్హత: ఇంటర్మీడియట్‌ (గణితం, భౌతికశాస్త్రం), ఇంజినీరింగ్‌ డిగ్రీ, లా డిగ్రీ, డిప్లొమా, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటరైజ్డ్‌ కాగ్నిటివ్‌ బ్యాటరీ టెస్ట్‌, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌, సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్ల ఆధారంగా.
పరీక్ష రుసుము: రూ.250 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-09-2022.

వెబ్‌సైట్‌:https://joinindiancoastguard.gov.in/


నేవీలో 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇండియన్‌ నేవీ... 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (పర్మినెంట్‌ కమిషన్‌) - జనవరి 2023 కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ బ్రాంచి: 31 పోస్టులు
* ఎడ్యుకేషన్‌ బ్రాంచి: 05 పోస్టులు
అర్హత: 70% మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో సీనియర్‌ సెకండరీ పరీక్ష (10+2) ఉత్తీర్ణత. జేఈఈ (మెయిన్‌)-2022 ర్యాంకు సాధించి ఉండాలి.
వయసు: 02-01-2003 నుంచి 01-01-2006 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 18-08-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-08-2022.

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/


మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో  గెస్ట్‌ ఫ్యాకల్టీ

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఒప్పంద ప్రాతిపదికన 24 గెస్ట్‌ టీచర్‌ ఖాళీల భర్తీకి తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
*పీజీటీ(ఐటీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కామర్స్‌, తెలుగు, ఇంగ్లిష్‌): 07 పోస్టులు
* టీజీటీ (తెలుగు, హిందీ, గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయో సైన్స్‌, ఇంగ్లిష్‌): 09 పోస్టులు
* ఆర్ట్‌ టీచర్‌: 01 పోస్టు 

*  పీఈటీ: 03 పోస్టులు

* హాస్టల్‌ వార్డెన్‌: 02 పోస్టులు

* స్టూడెంట్‌ కౌన్సెలర్‌: 02 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత, సీటెట్‌ స్కోర్‌.
పాఠశాలలున్న ప్రాంతాలు: కల్వకుర్తి, నాగర్‌ కర్నూల్‌, బాలానగర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లా.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 17.08.2022.

వెబ్‌సైట్‌: https://mahabubnagar.telangana.gov.in/


డిజైన్‌ & టెక్నాలజీ కోర్సు

సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్‌) డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.2,00,000(పట్టణ ప్రాంతాల్లో), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతాల్లో) మించకూడదు.
సీట్ల సంఖ్య: 40
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్ష ఫీజు: రూ.150.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 24.08.2022.

వెబ్‌సైట్‌:https://www.osmania.ac.in/


ప్రవేశాలు
గ్రూప్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గ్రూప్‌-3, 4 శిక్షణ కోసం పది, ఇంటర్‌, డిగ్రీలో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
ఎంపిక: విద్యార్హత పరీక్షలో వచ్చిన మార్కుల, సీట్ల లభ్యత ఆధారంగా ఉంటుంది.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 25-08-2022.
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 27-08-2022.
కోచింగ్‌ ప్రారంభం: 01-09-2022.

వెబ్‌సైట్‌https://studycircle.cgg.gov.in/tsbcw/TSBCFoundationCourseTspscReg22.


మరిన్ని

ap-districts
ts-districts