కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

* అమెరికా, భారత్‌, ఇజ్రాయెల్‌, యూఏఈ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కూటమి?
జ: 
I2U2

* ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అంచనాల నివేదిక - 2022 ప్రకారం ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరిస్తుంది?
జ:
2023

* వర్క్‌ ఫ్రం హోమ్‌ చట్టాన్ని ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ దిగువ సభ ఆమోదించింది?
జ:
నెదర్లాండ్స్‌

* మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద ఉన్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్ని యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది?
జ:
2,306

* మిలియన్‌ యూనిట్లు్య 2022, జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం ఎన్ని పరుగులు చేశారు?
జ:
10,868

* 2022, జులైలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ పొల్యూషన్‌ రిసెర్చ్‌ పత్రికలో ప్రకటించిన వివరాల ప్రకారం హిమాలయాల్లోని ద్రాస్‌ బేసిన్‌లోని 77 హిమానీ నదాల విస్తీర్ణం 176.77 చ.కి.మీ. నుంచి ఎంతకు తగ్గిపోయింది?
జ:
171.46 చ.కి.మీ.


మరిన్ని

ap-districts
ts-districts