కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

* సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ ఏ రోజున బాధ్యతలు స్వీకరించారు?

జ: 2022, ఆగస్టు 27

తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? (ఈయన పదవీ కాలాన్ని ప్రభుత్వం  ఇటీవల పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈయన పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.)    

జ: బోయినపల్లి వినోద్‌ కుమార్‌

సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఏ రోజున కోర్టు కార్యకలాపాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా దేశ  ప్రజలంతా వీక్షించేలా ఏర్పాటు చేశారు?  

జ: 2022, ఆగస్టు 26

2022 ఆగస్టు 22, 23 తేదీల్లో ‘గ్రామ పంచాయతీల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ - స్వీయ నిర్మాణాత్మక మౌలిక సదుపాయాలు’ అనే అంశంపై జాతీయ సెమినార్‌ను ఎక్కడ నిర్వహించారు?        

జ: ఛండీగఢ్‌

2022 ఆగస్టులో తెలంగాణ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మిషన్‌ మొబిలిటీ (టీ - ఎయిమ్‌) ప్రారంభించిన గ్రాండ్‌ ఛాలెంజ్‌ దేనికి సంబంధించింది? (విజేతకు రూ.20 లక్షల బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు)    

జ: కృత్రిమ మేధస్సు టెక్నాలజీ ద్వారా రోడ్లపై గుంతల గుర్తింపు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ఏ ట్విన్‌ టవర్స్‌ను 2022, ఆగస్టు 28న కూల్చివేశారు?

జ: అపెక్స్‌, సియానే

కొత్త తరం ఇంటర్‌నెట్‌ వెబ్‌ 3.0 పై ఉన్న గందరగోళాన్ని, అస్పష్టతను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ఏ పేరుతో నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది?

జ: శాండ్‌బ్యాక్స్‌

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా, జననాల రేటు ఆధారంగా సీఐఏ వరల్డ్‌ ఫ్యాక్ట్‌ బుక్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి నాలుగు నిమిషాలకు భారత్‌లో ఎన్ని జననాలు నమోదు అవుతున్నాయి? (రెండు, మూడు స్థానాల్లో వరుసగా చైనా (103 జననాలు), నైజీరియా (57 జననాలు) ఉన్నాయి)    

జ: 172


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని