
సంసారం - సన్యాసం
ఒకసారి గోవింద చందోర్కర్ తనను సంసార బంధాల నుంచి విముక్తుణ్ణి చేయమని సాయిని కోరాడు. దానికి బాబా ‘విధి, కర్మ నిరంతరం మనల్ని ఆడిస్తుంటాయి. మనమెంతో ఇష్టపడి కొన్న వస్తువే కొన్నాళ్లకి వెగటుగా తోస్తుంది. అందుకే బుద్ధిమంతులు వస్తు సంచయం పట్ల ఆసక్తి చూపరు. రెండు భిన్నత్వాల కలయికే సంసారం. వీటి వియోగం లేదా వికల్పం సన్యాసం. మరోలా చెప్పాలంటే మనసు కోరిన వస్తువును దేహం అనుభవిస్తోంది. అలా కాకుండా మనసును నియంత్రించి వస్తువాంఛకు దూరంగా ఉండటమే సన్యాసం. కోరిక లేనప్పుడు వస్తువుతో పనిలేదు. అప్పుడిక దేహానికి ఆ వస్తువు తాలూకు సుఖసౌఖ్యాలు పట్టవు. సంసార బంధాలను తెంచుకోడానికి ఈ సూత్రాన్ని అనుసరించాలే కానీ ఆశ్రమానికో అడవులకో వెళ్లడం కాదు. దేహం ఉన్నంతవరకు సంసారం ఉంటుంది. ధనికుల శునకం రాజభోగాలు అనుభవించడం, వీధికుక్క రొట్టెముక్క కోసం నిత్యం కష్టపడటం వెనుకున్నది పూర్వజన్మ కర్మలూ, ఫలితంగా ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టసుఖాలే’ అంటూ వివరించడంతో చందోర్కర్‌కి జ్ఞానోదయమైంది.
- ఉమాబాల
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు