కరెం ట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

2022 సెప్టెంబరులో రష్యా రాజధాని మాస్కోలో ఏ ప్రముఖ భారత సామాజిక కార్యకర్త, జానపద కవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు?(ఆల్‌ రష్యా స్టేట్‌ లైబ్రరీ ఫర్‌ ఫారిన్‌ లిటరేచర్‌ భవనంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈయన మహారాష్ట్రకు చెందినవారు. దళితోద్ధరణకు కృషి చేశారు) 

జ: అన్నాభావు సాఠే


లండన్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు?            

జ: షేక్‌ నజియా


కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను సవరించింది.   ఈ జాబితాలోకి కొత్తగా ఎన్ని ఔషధాలను చేర్చారు? (26 మందులను తొలగించారు. తాజాగా చేరిన ఔషధాలతో మొత్తం సంఖ్య 384కు చేరింది.)

జ: 34 ఔషధాలు


పోడు భూములకు పట్టాలిచ్చేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఏది? 

జ: జీఓ 140


దేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది? (ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి)

జ: హ్యూస్‌ కమ్యూనికేషన్‌ ఇండియా


హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌గా 2022, సెప్టెంబరు 13న ఎవరు బాధ్యతలు చేపట్టారు?

జ: జెన్నీఫర్‌ లార్సన్‌


ట్విటర్‌ ఫాలోవర్స్‌ 5 కోట్ల మంది దాటిన తొలి క్రికెటర్‌గా ఎవరు ఘనత సాధించారు?

జ: విరాట్‌ కోహ్లి


మరిన్ని