పర్యావరణం ప్రాక్టీస్‌ బిట్లు

1. ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలాధారం?

1) శ్వాసక్రియ 2) కిరణజన్య సంయోగక్రియ
3) సూర్యుడు 4) నక్షత్రాలు

2. జీవుల్లో ఏ ప్రక్రియ వల్ల ఆవరణ వ్యవస్థలో శక్తి నష్టం జరుగుతుంది?

1) కిరణజన్య సంయోగక్రియ 2) శ్వాసక్రియ
3) విసర్జన క్రియ      4) చలనం

3. చనిపోయిన జీవి నుంచి శక్తి ఏ రూపంలో నేలలోకి చేరుతుంది?

1) మాంసం   2) సేంద్రియ పదార్థం  
3) ప్రొటీన్‌లు   4) విసర్జక పదార్థాలు

4. వేటి మధ్య సంబంధాన్ని, క్రియను ఆవరణ పిరమిడ్‌లలో రేఖాత్మకంగా చూపిస్తారు?

1) పోషక స్థాయులు
2) ప్రాథమిక, ద్వితీయ వినియోగదారులు
3) సజీవులు, నిర్జీవులు  
4) భౌతిక, రసాయన కారకాలు

5. ఏ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్‌ నిట్ట నిలువుగా ఉంటుంది?

1) కొలను ఆవరణ వ్యవస్థ  
2) గడ్డి మైదానం ఆవరణ వ్యవస్థ  
3) సముద్ర ఆవరణ వ్యవస్థ   4) పైవన్నీ

6. అన్ని ఆవరణ వ్యవస్థల్లో ఉండే పిరమిడ్‌లలో శక్తి పిరమిడ్‌ నిలువుగా ఉండటానికి కారణం?

1) ఒక పోషక స్థాయి నుంచి మరొక స్థాయికి శక్తి తగ్గడం
2) సూర్యకాంతి ఎక్కువగా లభించడం
3) అడుగుభాగంలో ఉత్పత్తిదారులు ఉండటం
4) పైభాగంలో ఉత్పత్తిదారులు ఉండటం

సమాధానాలు: 1-3; 2-2; 3-2; 4-1; 5-4; 6-1.


మరిన్ని