లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇంట విందు

హాజరైన వెంకయ్యనాయుడు, జగదీప్‌ ధన్‌ఖడ్‌

ఈనాడు, దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన స్థానంలో ఆ పదవికి ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌లకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో విందు ఇచ్చారు. వెంకయ్యనాయుడు పదవీ కాలం బుధవారంతో ముగియనుండడం, ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో వారిద్దర్నీ స్పీకర్‌ ఓం బిర్లా తన ఇంటికి సాదరంగా ఆహ్వానించారు.  శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు, ఓం బిర్లాలు పార్లమెంటరీ వ్యవహారాలు, జాతీయ ప్రాధాన్యమున్న అంశాలను, చట్టసభల నిర్వహణలో తమ అనుభవాలను జగదీప్‌ ధన్‌ఖడ్‌తో పంచుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉపరాష్ట్రపతి.. రాజ్యసభ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. ఓం బిర్లా, జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఇద్దరూ రాజస్థాన్‌ రాష్ట్రానికే చెందిన వారు కావడం... పార్లమెంటు ఉభయ సభలకు అధ్యక్షులు కావడం విశేషం.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని