Viral news: ఆయనకు 75.. ఆమెకు 70.. పెళ్లయిన 54 ఏళ్లకు సంతానం!

పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత ఆ ఇంట బుజ్జాయి కేరింతలతో సందడి నెలకొంది. తమ కలల రూపాన్ని చూసి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది. 75 ఏళ్ల భర్తకు, 70 ఏళ్ల భార్యకు వైద్యులు ఐవీఎఫ్‌ విధానంలో సంతాన భాగ్యం కలిగించారు. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని అల్వర్‌లో జరిగింది. మాజీ సైనికుడైన గోపీచంద్‌కు, చంద్రావతికి 1968లో వివాహమైంది. ఎన్నేళ్లయినా సంతానం కలగలేదు. ఏడాదిన్నర క్రితం ఓ ఆసుపత్రిలో ఐవీఎఫ్‌ నిపుణుడైన డాక్టర్‌ పంకజ్‌ గుప్తను సంప్రదించారు. తొలి రెండు యత్నాలు విఫలమైనా కుంగిపోలేదు. మూడో ప్రయత్నంలో వారి కల ఫలించింది. చంద్రావతి సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజస్థాన్‌లో ఏడుపదుల వయసులో ఉన్న తల్లిదండ్రులకు ఐవీఎఫ్‌ విధానంలో సంతానం కలగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చని వైద్యులు చెబుతున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని