ముందుజాగ్రత్త డోసుగా కార్బెవ్యాక్స్‌!

త్వరలోనే అనుమతించనున్న కేంద్రం

దిల్లీ: తొలి రెండు టీకా డోసులుగా కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారికి ముందుజాగ్రత్త డోసుగా బయోలాజికల్‌ ఈకి చెందిన కార్బెవ్యాక్స్‌ను వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ త్వరలోనే ఆమోదం తెలుపనుందని అధికారవర్గాలు మంగళవారమిక్కడ తెలిపాయి. ఎన్‌టాగీ (ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం) వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. అధికారికంగా ఆమోదం లభిస్తే.. దేశంలో కొవిడ్‌-19కు సంబంధించి తొలి రెండు డోసులుగా ఒక కంపెనీ టీకా, ముందుజాగ్రత్త డోసుగా వేరే కంపెనీ టీకా వేయడం తొలిసారి అవుతుంది.


మరిన్ని

ap-districts
ts-districts