సంక్షిప్త వార్తలు (3)


మాస్కు లేకపోతే రూ. 500 జరిమానా

దిల్లీ: కొవిడ్‌ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోనివారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు.


ముందస్తు విడుదలకు నళిని పిటిషన్‌

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షను ఎదుర్కొంటున్న నళిని.. తనను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో తన అభ్యర్థనను మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించడాన్ని ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. సహ నిందితుడు పెరారివలన్‌ను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని పిటిషన్లో గుర్తుచేశారు.


పత్రాల సమర్పణకు ఠాక్రే వర్గానికి మరింత గడువు

దిల్లీ: శివసేన పార్టీ ఎన్నికల చిహ్నం తమదేనని చెబుతున్న ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం మరో 15 రోజులు గడువు ఇచ్చింది. విల్లు-బాణం గుర్తు తమకే చెందాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, మాజీ సీఎం ఠాక్రే చెబుతున్న నేపథ్యంలో దానిని బలపరిచే పత్రాలను ఈ నెల 8 లోగా సమర్పించాలని ఈసీ గత నెలలో ఆదేశించింది. ఠాక్రే వర్గం వినతి మేరకు గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది.


మరిన్ని

ap-districts
ts-districts