యమునలో పడవ మునక.. 17 మంది గల్లంతు

నాలుగు మృతదేహాల వెలికితీత

రక్షాబంధన్‌కు వెళుతుండగా ప్రమాదం

బాందా (యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునానదిలో గురువారం పడవ మునిగి 17 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. 13 మందిని కాపాడారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. పడవలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తమ సోదరులను కలిసి రక్షాబంధన్‌ వేడుకలను జరుపుకొనేందుకు వెళుతున్న మహిళలు కూడా వీరిలో ఉన్నారు. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి, పట్టుతప్పి పడవ మునిగిపోయినట్లు బాందా జిల్లా జడ్జి అనురాగ్‌ పటేల్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని