బీమా పరిహారానికి వివాహిత కుమార్తెలూ అర్హులే

కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, న్యూస్‌టుడే: ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు బీమా పరిహారాన్ని అందుకునేందుకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. హుబ్బళ్లి సమీపంలోని యమనూరులో 2012 ఏప్రిల్‌ 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో రేణుక (57) అనే మహిళ మరణించారు. తమకు పరిహారాన్ని ఇవ్వాలని రేణుక భర్త, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు బీమా సంస్థను ఆశ్రయించారు. వివాహితులైన కుమార్తెలకు పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని బీమా సంస్థ చెప్పడంతో వారు మోటారు వాహన ప్రమాదాల న్యాయ పంచాయతీని ఆశ్రయించారు. వారికి సాలీనా ఆరు శాతం వడ్డీతో రూ.5,91,600 చెల్లించాలని న్యాయ పంచాయతీ తీర్పు ఇచ్చింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని