కార్యాలయ సిబ్బంది కుమార్తెలతో ప్రధాని రక్షాబంధన్‌

దిల్లీ: సోదర భావాన్ని ప్రస్ఫుటించే రక్షాబంధన్‌ పర్వదినాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)లో పనిచేసే సిబ్బంది కుమార్తెలతో కలసి ఆయన రాఖీ వేడుకలో పాల్గొన్నారు. పీఎంవో అధికారులతో పాటు స్వీపర్లు, ప్యూన్లు, గార్డెన్‌ సిబ్బంది, డ్రైవర్లు, ఇతర ఉద్యోగుల కుమార్తెలతో రాఖీ కట్టించుకున్నారు. ఆ తర్వాత వారితో కాసేపు సరదాగా ముచ్చటించి, చిన్నారులను ఆశీర్వదించారు. దీంతోపాటు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా వారికి జాతీయ జెండాలను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ప్రధాని ట్విటర్‌లో పంచుకున్నారు. ‘‘ఈ చిన్నారులతో నా రక్షా బంధన్‌ ప్రత్యేకం. జాతీయ జెండాతో ప్రతి ఒక్క భారతీయుడికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తిరంగాను ఇస్తున్నప్పుడు ఆ చిన్నారుల్లో కనిపించిన ఉత్సాహమే అందుకు నిదర్శనం’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు, ఆయన ట్విటర్‌ వేదికగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని