చేపల చెవి ఎముకల్లో సముద్ర ఉష్ణోగ్రతల గుట్టు!

బెంగళూరు: సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పూర్వం ఏ కాలంలో ఎంత ఉండేవో తెలుసుకునేందుకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. చేపల చెవుల్లో ఉండే ‘ఓటోలిథ్స్‌ (కర్ణాశ్మం)’ అనే బుల్లి ఎముకను బట్టి ఉష్ణోగ్రతల తీవ్రతను నిర్ధారించొచ్చని వారు వెల్లడించారు. ప్రవాళాల తరహాలో ఓటోలిథ్స్‌ కూడా క్యాల్షియం కార్బొనేట్‌తో తయారవుతాయి. చేపలు జీవించి ఉన్నంతకాలం.. ఖనిజ లవణాలను శోషించుకుంటూ ఈ ఎముక పెరుగుతూనే ఉంటుంది. వృక్ష వలయాలను బట్టి వృక్షాల వయసును చెప్పినట్టే.. కర్ణాశ్మం ఆధారంగా మత్స్యాల వయసును నిర్ధారించొచ్చు. మీనాలు ఏ తరహా నీటిలో జీవించాయో, ఎలా వలస వెళ్లాయో కూడా వాటి ద్వారా గుర్తించొచ్చు. ఓటోలిథ్స్‌లోని విభిన్న క్యాల్షియం ఐసోటోపుల నిష్పత్తులను థర్మల్‌ అయనైజేషన్‌ మాస్‌ స్పెక్టోమీటర్‌ (టిమ్స్‌) ద్వారా విశ్లేషిస్తే.. సముద్ర ఉష్ణోగ్రతలను దాదాపు కచ్చితత్వంతో నిర్ధరించొచ్చని పరిశోధకులు తెలిపారు. జురాసిక్‌ కాలం (17.2 కోట్ల ఏళ్ల క్రితం) నాటి కర్ణాశ్మాల నమూనాలు కూడా తమకు లభ్యమైనట్లు వారు వెల్లడించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని