భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టింది

షాజహాన్‌పుర్‌ (యూపీ): భర్తతో గొడవపడిన ఆ ఇల్లాలు.. అతణ్ని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గఢియా రంగీన్‌ పోలీస్‌స్టేషను పరిధిలో వెలుగుచూసింది. తన భర్త ఆత్మహత్య చేసుకొన్నట్లు ఆమె అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఖమారియా గ్రామానికి చెందిన గోవింద్‌ ఈ నెల 7వ తేదీన తన భార్య శిల్పితో గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి గోవింద్‌ను కొట్టిచంపిన శిల్పి ఇంట్లోనే గొయ్యి తవ్వి పాతిపెట్టింది. రెండు రోజుల తర్వాత.. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో  ఇరుగు పొరుగువారు మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉంటున్న గోవింద్‌ తల్లికి సమాచారం చేరవేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు గ్రామీణ ఎస్పీ సంజీవ్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. తన భర్త మద్యం వ్యసనపరుడని శిల్పి పోలీసులకు తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, విచారణ కొనసాగిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని