లోయలోపడిన జవాన్ల బస్సు

ఏడుగురి మృతి 

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్ర విధులు ముగించుకొని తిరుగుముఖం పట్టిన ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) జవాన్ల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం వీరు ప్రయాణిస్తున్న బస్సు పహల్గాం ప్రాంతం చందన్‌వారీ వద్ద 60 మీటర్ల లోతు లోయలోకి  పడిపోయింది. ఏడుగురు జవాన్లు మృతిచెందగా, 32 మంది గాయపడ్డారు. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీస్‌ కంట్రోల్‌ రూముకు తిరిగివస్తున్న ఈ బస్సులో 37 మంది ఐటీబీపీ సిబ్బంది, ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఐటీబీపీ సిబ్బందిలో ఇద్దరు  ప్రమాదస్థలిలోనే మృతిచెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడి తర్వాత కన్నుమూశారు. క్షతగాత్రుల్లో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ శ్రీనగర్‌ ఆసుపత్రికి తరలించారు. పహల్గాం ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ ద్వారా జవాన్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని