తీస్తా సీతల్వాడ్‌ బెయిల్‌ పిటిషన్‌పై 22న విచారణ

దిల్లీ: సామాజిక ఉద్యమకర్త తీస్తా సీతల్వాడ్‌ బెయిల్‌ అభ్యర్థనపై ఈ నెల 22న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. 2002 అల్లర్ల కేసులో అమాయక ప్రజలపై అభియోగాలు మోపడానికి తప్పుడు సాక్ష్యాలను సృష్టించారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీతల్వాడ్‌, మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌లు ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్‌ అభ్యర్థనల్ని అహ్మదాబాద్‌ సెషన్స్‌ న్యాయస్థానం తిరస్కరించింది. దానిపై వారు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి తదుపరి విచారణను సెప్టెంబరు 19కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో జస్టిస్‌ రమణ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ హిమాకొహ్లిల ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చినప్పుడు విచారణ తేదీని నిర్ణయించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని