పసికందు మృతదేహంతో జైలు వద్ద మహిళ నిరీక్షణ

ఆ మహిళ గర్భం దాల్చానని సంబరపడింది. ఈలోపే భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినా ఆ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. అనారోగ్యంతో బిడ్డ చనిపోయాడు. పిల్లాడి మృతదేహాన్ని అయినా భర్తకు చూపిద్దామని జైలుకు వెళ్లింది. 7 గంటలకు పైగా అధికారులను వేడుకుంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ బతిమిలాడినా అధికారులు లోపలకి అనుమతించక పోవడంతో చేసేది లేక బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించింది. ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. జైలు నియమాల ప్రకారం ఆదివారం ఖైదీలను ఎవరూ కలిసే అవకాశం లేనందున, ఆ మహిళ తన భర్తను కలవలేకపోయిందని జైలు అధికారి చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని