విమానంలో ధూమపానం.. బాబీ కటారియాపై కేసు నమోదు

దిల్లీ: ఓ స్పైస్‌జెట్‌ విమానం లోపల బాడీబిల్డర్‌ బల్వంత్‌ కటారియా అలియాస్‌ బాబీ కటారియా సిగరెట్‌ కాల్చిన వీడియో బయటకు రావడంతో దిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. భద్రతా ప్రమాణాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినట్లు అతనిపై దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు స్టేషన్‌లో స్పైస్‌జెట్‌ మేనేజర్‌ (లీగల్‌, కంపెనీ వ్యవహారాలు) జస్బీర్‌ సింగ్‌ ఈనెల 13న ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌ నుంచి దిల్లీకి వచ్చే విమానంలో కటారియా ధూమపానం చేస్తున్న ఫొటోలు, వీడియోలను అతనే సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని