
మహాత్ముడి విలువలకు పునరంకితమవుదాం
గాంధీ, లాల్ బహదూర్‌లకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు నేతలు ఆదివారం ఆ ఇద్దరికీ నివాళులు అర్పించారు. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించిన రాష్ట్రపతి.. గాంధీజీ నేర్పిన విలువలకు మనం పునరంకితం కావడానికి ఈ జయంతి ఒక సందర్భమన్నారు. విజయ్‌ఘాట్‌లో శాస్త్రికి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించిన ప్రధాని మోదీ.. గాంధీ గౌరవార్థం ఖాదీ, హస్తకళల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘నిరాడంబరుడైన శాస్త్రి భారత చరిత్రలో చాలా కీలకమైన సమయంలో పటిష్ఠ నాయకత్వం అందించారు’’ అని ప్రశంసించారు. గాంధీ, శాస్త్రిలకు నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు ఉన్నారు.
సెంట్రల్‌హాలులో 99 మంది విద్యార్థులు
దేశంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి ఎంపిక చేసిన 99 మంది విద్యార్థులు ఆదివారం పార్లమెంటు సెంట్రల్‌హాలులో సందడి చేశారు. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఈ నేతల చిత్రపటాలకు ప్రముఖుల పుష్పాంజలి కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు బాపు, శాస్త్రిలకు నివాళులర్పించారు. దివంగత నేతల గురించి విద్యార్థుల బృందం నుంచి 30 మంది మాట్లాడారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు