
మహారాష్ట్ర సీఎం శిందే సంతకం ఫోర్జరీ.. వ్యాపారికి రూ.కోటికిపైగా టోకరా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నకిలీ సంతకంతో ఇద్దరు మోసగాళ్లు ఓ వ్యాపారికి భారీగా టోకరా పెట్టారు. వ్యాపారి నుంచి విడతల వారీగా రూ.1.31 కోట్లు తీసుకున్నారు. ప్రభుత్వ ఈ-పోర్టల్‌లో భాగస్వామ్యం ఇప్పిస్తామని నమ్మించి వ్యాపారి గోపాని నుంచి నిందితులు మొదట రూ.లక్ష వసూలు చేశారు. అనంతరం విడతలవారీగా మొత్తం రూ.1.31 కోట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 25న నిందితులు ఈ-పోర్టల్ ఫ్రాంచైజీ కోసం లైసెన్స్, పర్మిట్, ఇతర రుసుములకు సంబంధించిన రసీదు (పేమెంట్ స్లిప్)ను గోపానికి ఇచ్చారు. ఆ రసీదులో సీఎం ఏక్నాథ్ శిందే సంతకం ఇంగ్లీష్‌లో ఉంది. సంతకంపై అనుమానం రావడంతో గోపాని.. వాలివ్ పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!