ములాయం ఆరోగ్యం విషమం

గురుగ్రాం/లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ (82) ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం గురుగ్రాంలోని మేదాంతా ఆసుపత్రి ఐసీయూ విభాగానికి ఆయనను తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత 40 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం ప్రస్తుతం క్యాన్సర్‌ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆసుపత్రికి చేరుకున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ చేసి ములాయం ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.


మరిన్ని