ప్రశాంత్‌ కిశోర్‌ పాదయాత్ర ప్రారంభం

 భితిహర్వా నుంచి మొదలుపెట్టిన రాజకీయ వ్యూహకర్త

భితిహర్వా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ‘జన్‌ సురాజ్‌’ ప్రచారం కోసం చేపడుతున్న 3,500 కిలోమీటర్ల పాదయాత్ర మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. 1917లో గాంధీజీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లా భితిహర్వా నుంచే ప్రశాంత్‌ తన కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం. పాదయాత్రలో భాగంగా ప్రశాంత్‌ కిశోర్‌, ఆయన అనుచరులు రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ, బ్లాక్‌లో పర్యటించనున్నారు. మొత్తంగా పాదయాత్రకు 12 నుంచి 18 నెలల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. అత్యంత వెనుకబడిన, పేద రాష్ట్రమైన బిహార్‌లో వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నట్లు యాత్రకు ముందు ప్రశాంత్‌ కిశోర్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. బిహార్‌లోని గ్రామాలు, పట్టణాలు, నగరాల మీదుగా సాగే పాదయాత్ర.. సమాజంలో మెరుగైన వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో తొలి అడుగని ఆయన చెబుతున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు