వంతెన ‘అడ్డు’తొలగించారు

 పుణెలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి కూల్చివేత

600 కేజీల పేలుడు పదార్థాల వినియోగం

పుణె: తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక పాత వంతెనను అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్చేశారు. ఈ వంతెనను 90వ దశకం ప్రారంభంలో నిర్మించారు. ముంబయి-బెంగళూరు జాతీయ రహాదారిపై చాందినీ చౌక్‌ వద్ద ఉన్న దీనిని కూల్చివేసేందుకు సుమారు 600 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత సమయంలో వాహనాలను వేరే మార్గంలో పంపారు. కూల్చివేత అనంతరం శిథిలాలను తొలగించి ఉదయం 10 గంటల సమయంలో వాహనాలను అనుమతించారు. ఇటీవల నొయిడాలో ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేసిన ఎడిఫిస్‌ సంస్థే పుణెలోనూ వంతెన కూల్చివేత పనులు చేపట్టింది.


మరిన్ని