
మళ్లీ కలం పట్టిన సాయినాథ్
విస్మృత పోరాటయోధులపై ‘ది లాస్ట్ హీరోస్’ పేరుతో పుస్తకం
వచ్చే నెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు
దిల్లీ: మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘ఎవ్రీ బడీ లవ్స్ ఏ గుడ్ డ్రాట్’ పుస్తకం రాసిన ప్రముఖ రచయిత, జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ రెండు దశాబ్దాల తరువాత మరో పుస్తకాన్ని వెలువరిస్తున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న రైతులు, కార్మికులు, గృహిణులు, కళాకారులు తదితరుల అవిశ్రాంత పోరాటాన్ని ఇందులో వివరిస్తున్నారు. ఈ పుస్తకం వచ్చే నెల 21న విడుదల కానుంది. విస్మృత పోరాటయోధుల గురించి ‘ది లాస్ట్ హీరోస్’ పేరుతో ఆయన రాసిన పుస్తకాన్ని పెంగ్విన్ సంస్థ ప్రచురిస్తోంది. ‘దేశ విముక్తి కోసం పోరాడిన ఈ వీరులు 5, 6 ఏళ్ల తరువాత మనతో జీవించి ఉండరు. కొత్త తరానికి వారి పరిచయం లేదు. మాట్లాడడం, చూసే భాగ్యం కూడా లేదు. మన స్వాతంత్య్ర ఉద్యమంపై యువతకు పరిజ్ఞానాన్ని పెంచడమే పుస్తక రచనకు ప్రేరేపించింది. స్వేచ్ఛ కోసం ఎందరో త్యాగాలు చేశారు. ఆ సమయంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫుటమైంది. దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి యోధులను గుర్తు చేసుకోవడమే ఈ పుస్తకం లక్ష్యం’ అని సాయినాథ్ వివరించారు. ఆయన తొలి పుస్తకం విశేష ఆదరణ పొంది 56వ ప్రచురణకు వెళ్లింది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం