సంప్రదాయ పశువైద్యంతో సురక్షితమైన పాల ఉత్పత్తి

సీఎస్‌ఈ వెల్లడి

దిల్లీ: పాడి పరిశ్రమలో యాంటీబయోటిక్స్‌ను ఇష్టమొచ్చినట్టు, మోతాదుకి మించి వినియోగిస్తున్న కారణంగా యాంటీబయోటిక్స్‌ను తప్పించుకునే సామర్థ్యాన్ని బ్యాక్టీరియా సంతరించుకుందని...ఈ పరిస్థితిని అధిగమించి, సురక్షితమైన పాలను ఉత్పత్తి చేసేందుకు సంప్రదాయ పశువైద్యం (ఎథ్నోవెటర్నరీ మెడిసిన్‌) దోహదపడుతుందని దిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నిపుణులు అభిప్రాయపడ్డారు. డైరీ రంగంలో యాంటీబయోటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఎథ్నోవెటర్నరీ మెడిసిన్‌ (ఈవీఎం)ను తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. ఈ తరహా వైద్యంపై జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ) నేతృత్వాన సాగుతున్న ప్రాజెక్టు ఫలితాలు ఎంతో సానుకూలంగా ఉన్నట్టు వెల్లడించారు. ‘వరల్డ్‌ యాంటీమైక్రోబియల్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ సందర్భంగా మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో వారు మాట్లాడారు. ‘‘యాంటీబయోటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా సంప్రదాయ, మూలికలతో పశువులకు ఔషధాలను అందించాలి. ప్రమాదకర రసాయనాలు లేకుండానే దేశ పాడి పరిశ్రమను రక్షించుకోవడం సుసాధ్యమవుతుంది’’ అని సీఎస్‌ఈ డీజీ సునీత నారాయణ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎన్‌డీడీబీ 2014లో ప్రారంభించిన ‘మాస్టిటిస్‌ కంట్రోల్‌ పాపులరైజేషన్‌ ప్రోగ్రాం’ను ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, యూపీల్లోని 16 పాల సంఘాలు, పాల ఉత్పత్తి సంస్థలు పాటిస్తున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు