పంట రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగించేందుకు కేంద్రం సమ్మతి

రూ.3 లక్షలకు మించని అప్పులకు వర్తింపు

ముంబయి: స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ రాయితీని ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ) ద్వారా రూ.3లక్షలకు మించకుండా బ్యాంకు రుణం తీసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. వీరికి 7శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. బ్యాంకులకు సకాలంలో బకాయిలు తీర్చిన రైతులకు 3శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. దీంతో 4శాతం వడ్డీకే పంట రుణం లభించినట్లవుతుంది. రైతులకు రుణాలిచ్చే ఆర్థిక సంస్థలకు అందజేసే నిధుల విషయంలో 1.5శాతం మేర వడ్డీ రాయితీ ఉంటుందని రిజర్వు బ్యాంకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు