
పిల్లలను కనే గుడ్డి చేపలు!
దిల్లీ: హిందూ మహాసముద్రంలోని లోతు జలాల్లో పాన్కేక్ సీ అర్చిన్లు, కళ్లు లేని ఈల్ ఫిష్, గబ్బిలాల ఆకారంలో ఉండే చేపలు.. లాంటి పలు వింత జలచరాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మ్యూజియమ్స్ విక్టోరియా పరిశోధన సంస్థకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తల బృందం ఆస్ట్రేలియాలోని కొకోస్ దీవి మెరైన్ పార్కులోని సముద్రపు అట్టడుగు భాగంలో వీటి గురించి వివరంగా పరిశోధించారు. హిందూ మహాసముద్రంలో ఇంతకుముందు ఎప్పుడూ గమనించని సముద్రపు లోతుల్లో ఉండే జీవజాలం గురించి కూడా తాము పరిశోధించినట్లు ఆస్ట్రేలియా పరిశోధక నౌక ‘ఇన్వెస్టిగేటర్’ వర్గాలు తెలిపాయి. సముద్రపు ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల లోతున చాలా వైవిధ్యమైన చేప జాతులు ఉన్నట్లు నీటి అడుగున వీడియోలు తీశారు. వీటిలో కళ్లు లేని ఈల్ చేపలు ప్రత్యేకం. మిగిలిన చేపల్లా గుడ్లు పెట్టడానికి బదులు.. ఇవి పిల్లలను కంటున్నాయి. గబ్బిలం ఆకారంలో ఉండే మరో రకం చేప చేతుల్లా ఉన్న రెక్కల సాయంతో తిరుగాడుతుంది. ముక్కుపై ఉన్న కండను ఎరగా చూపి ఇది వేటాడుతుంది. దిగువ భాగంలో నమ్మశక్యం కాని పొడవైన రెక్కల్లాంటివి ఉండే ట్రిబ్యూట్ స్పైడర్ఫిష్ (సాలీడు చేప)లనూ అక్కడ గుర్తించారు. ఈ రెక్కల సాయంతో ఇది ప్రవాహం దిగువన నిలదొక్కుకొని చిన్నపాటి రొయ్యలను తింటుంది. పెలికాన్ ఈల్, బల్లి లాంటి చేప, వైపర్ ఫిష్, స్లెండర్ స్నైప్ ఈల్ లాంటి వేర్వేరు జీవాలూ ఉన్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన చీఫ్ సైంటిస్ట్ టిమ్ ఓ హరా తెలిపారు.
మరిన్ని
Amit Shah: సీబీఐ, ఈడీ దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన అమిత్ షా
Divorce: భార్యకు హెచ్ఐవీ అంటూ విడాకులకు దరఖాస్తు.. బాంబే హైకోర్టు ఏమన్నదంటే!
Morbi Bridge Collapse: ఆ పరిహారం సరిపోదు.. మోర్బీ ఘటనపై గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యలు!
Sharad Pawar: గవర్నర్ తన హద్దులన్నీ దాటారు.. శరద్ పవార్ విమర్శలు
Richa Chadha: గల్వాన్ ప్రస్తావన.. నటి పోస్ట్‌పై నెట్టింట దుమారం!


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్