women: అమ్మకు తీపిజబ్బుతో పెనుముప్పు

ఇంటర్నెట్ డెస్క్‌: అమ్మ కావడం తీయటి కల..దాన్ని సాకారం చేసుకోవడానికి ఎన్నో సమస్యలను అధిగమించాలి. ఎక్కడ చిన్న పొరపాటు వచ్చినా తల్లీ బిడ్డకు ఇబ్బందులు తప్పవు. గర్భిణి కాగానే మూడు నెలల్లోనే కొంతమందికి మధు మేహం వస్తుంది. దాన్ని పట్టించుకోకుండా ఉంటే చాలా సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్సులిన్‌ నిరోధకతతో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పిండం ఎదుగుదల కూడా సరిగా ఉండదని గైనకాలజిస్టు డాక్టర్‌ పెర్మి మంజుశ్రీ తెలిపారు. 

మధుమేహం నియంత్రణలో లేకపోతే...

ముందుగా చక్కెర వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే మూడు నెలల లోపే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.  పిండం అవయవాల్లో తేడా రావొచ్చు. ఇన్సులిన్‌ ఎక్కువగా పెరిగి బిడ్డ బరువు పెరిగే వీలుంది. ప్రసవం సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో తొమ్మిది నెలల కంటే ముందే ప్రసవం చేయక తప్పదు. ఆ తర్వాత మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. ఆరు వారాల తర్వాత ఫాస్టింగ్‌ షుగర్‌ లెవల్స్‌ను పరీక్ష చేయించి ఆహారంలో మార్పులు చేసుకోవాలి



మరిన్ని

ap-districts
ts-districts