Hyper Aadi: శ్రద్ధాదాస్ ముద్దు కోసం ఆది ప్రయత్నం.. ఫన్నీ వీడియో చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను పాల్గొనే కార్యక్రమాల్లోని సభ్యులు, న్యాయ నిర్ణీతలతో హైపర్‌ ఆది (Hyper Aadi) సరదాగా ఉంటారనే విషయం తెలిసిందే. వారిపై తనదైన శైలిలో పంచ్‌లు వేసి సందడి చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే నటి శ్రద్ధాదాస్‌ (Shraddha Das) ముద్దు కోసం ప్రయత్నించి నవ్వులు పంచారు. ప్రముఖ రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ 14’లో (Dhee 14) ఈ ఫన్నీ సీన్‌ కనిపించింది. వారానికో కొత్త కాన్సెప్ట్‌తో డ్యాన్సర్లలోని ప్రతిభను బయటకు తీస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు ‘కలర్స్‌ స్పెషల్‌’తో సిద్ధమైంది. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోని ఓ బాలుడి ప్రదర్శనకు ఫిదా అయిన న్యాయనిర్ణీతల్లో ఒకరైన శ్రద్ధాదాస్‌ అతడిని తన సీట్‌ దగ్గరకు ఆహ్వానిస్తుంది. ఆ హుషారైన బాలుడు శ్రద్ధాదాస్‌ బుగ్గపై ముద్దు పెడతాడు. కట్‌ చేస్తే, ఆ అబ్బాయిలానే హైపర్‌ ఆది శ్రద్ధ ముద్దు కోసం ప్రయత్నిస్తాడు. ‘కిస్‌ కాదు హగ్‌ ఇస్తా’ అని శ్రద్ధ అనగానే అక్కడున్న వారంతా ఆదిని ఆపేస్తారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కామెడీ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. ‘ఈటీవీ’లో (ETV) ఈ నెల 10 రాత్రి 9: 30 గం.లకు ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా నెట్టింట విడుదలై, అందరినీ అలరిస్తోంది.



మరిన్ని

ap-districts
ts-districts