ట్రాక్టర్‌ నడిపిన యువతి.. ఊరి నుంచి బహిష్కరణ

యువతి ట్రాక్టర్‌ నడుపుతూ వ్యవసాయం చేస్తోందని.. దీని వల్ల గ్రామానికి చెడు జరుగుతుందని నమ్మిన గ్రామస్థులు.. ఆమెను బహిష్కరించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని గుమ్లాలో జరిగింది. శివనాథ్‌పుర్‌ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మంజు ఓరన్‌.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం చేయడం ప్రారంభించింది. ఓ పాత ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి.. స్వయంగా పొలాన్ని దున్నుతోంది. దీనిని గమనించిన గ్రామస్థులు.. మహిళలు ట్రాక్టర్‌ నడిపితే చెడు జరుగుతుందని.. దీని వల్ల గ్రామంలో కరవు వస్తుందని, వెంటనే నిలిపివేయాలని ఆమెను వారించారు. పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. మంజు ఓరన్‌.. గ్రామస్థులు చేసిన తీర్మానాన్ని తిరస్కరించింది. తాను అంగీకరించబోనని.. వ్యవసాయం చేయడాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని