Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. సూపర్‌ పవర్‌ ఎవరో చైనాకు చెప్పిన అమెరికా..!

నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన తర్వాత దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ హంగామా పెరిగిపోయిది. నాలుగురోజులపాటు నాన్‌స్టాప్‌ యుద్ధవిన్యాసాల పేరిట క్షిపణి ప్రయోగాలు, ఫైటర్‌ జెట్‌ల విన్యాసాలు చేపట్టింది. ఓ రకంగా పెలోసీ పర్యటన ఆసియా ప్రాంతంలో డ్రాగన్‌ ప్రతిష్ఠకు గండి కొట్టింది. వాస్తవానికి పెలోసీ పర్యటనతో దక్షిణ చైనా సముద్రంలోని చైనా బాధిత దేశాలు అమెరికా దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మరికొన్నాళ్లలో మూడోసారి పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్న షీ జిన్‌పింగ్‌కు ఈ పర్యటన పెద్ద ఎదురు దెబ్బ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తైవాన్‌కు వెళ్లకుండా మమ్మల్ని ఆపడం చైనా తరం కాదు.. : పెలోసీ

2. రివ్యూ: కడువా

ఇదొక మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. కథా బలమున్న చిత్రాలు వెండితెరను పలకరించే మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటివి కాస్త అరుదు. సినిమా మొదలైన దగ్గరి నుంచి చివరి వరకూ కథానాయకుడు, ఆయన పాత్రను ఎలివేట్‌ చేయడమే పరమావధిగా సాగుతుంది.  కడువా జైలుకు రావడంతో సినిమా మొదలవుతుంది. ఆ పాత్రను ఎలివేట్‌ చేస్తూ, హైప్‌ఇస్తూ వచ్చే సన్నివేశాలను తీర్చిదిద్దారు. అక్కడి నుంచి కథ ప్లాట్‌ పాయింట్‌ను రివీల్‌ చేసుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఐజీ జోసెఫ్‌, కడువాల మధ్య వార్‌ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సుధీర్‌ గోల్డ్‌ ‘లిఫ్ట్’.. మీరూ చూసేయండి..!

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్‌.. రెండో ప్రయత్నంలో 212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్‌ చేశాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీలకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మొత్తం 134.5 పాయింట్లు సాధించిన సుధీర్‌ స్వర్ణపతకం నెగ్గాడు. దీంతో భారత్‌ ఖాతాలో ఆరో బంగారు పతకం చేరింది. మొత్తం పతకాల సంఖ్య 20 అయింది. అందులో ఆరు స్వర్ణాలు, ఏడేసి రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీవీ డిబేట్‌లో రిషి సునాక్‌ అనూహ్య విజయం.. ఇరకాటంలో లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక కోసం జరుగుతోన్న రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆయన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే వెనుకంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతోన్న వేళ.. ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కీలకమైన టీవీ డిబేట్‌లో ట్రస్‌పై రిషి అనూహ్య విజయం సాధించారు. స్కై న్యూస్‌ నిర్వహించిన ‘బ్యాటిల్‌ ఫర్‌ నంబర్‌ 10’ టీవీ డిబేట్‌లో స్టూడియో ప్రేక్షకులు సునాక్‌కు మద్దతిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అనుకున్నదాని కంటే ఎక్కువే వడ్డించిన ఆర్‌బీఐ.. EMIలు మరింత భారం!

అంతా ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే (Repo Rate) వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు శుక్రవారం ప్రకటించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు 35 బేసిస్‌ పాయింట్లు కాకుండా ఆర్‌బీఐ మరింత అధిక పెంపునకు మొగ్గుచూపడం గమనార్హం. కొవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్‌బీఐ (RBI) వరుసగా మూడోసారి రెపోరేటు (Repo Rate)ను పెంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆక్సిజన్‌ఓఎస్‌ 13లో కొత్తగా ఏమేం రాబోతున్నాయంటే?

వన్‌ప్లస్ (OnePlus) కొత్త వెర్షన్‌ ఆక్సిజన్ ఓఎస్‌ను తీసుకురానుంది. ఆక్సిజన్‌ఓఎస్‌ 13 (OxygenOS 13)గా తీసుకొస్తున్న ఓఎస్‌లో క్యారెక్టర్‌స్టిక్స్, ప్రొడక్టివిటీ, కనెక్టివిటీ, సేఫ్టీలకు ప్రాధాన్యమిస్తోంది. ముందుగా ఈ వెర్షన్‌ను వన్‌ప్లస్‌ 10 ప్రో మోడల్‌లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. తర్వాత కొత్తగా విడుదలైన వన్‌ప్లస్‌ 10టీ మోడల్‌లో తీసుకురానున్నారు. ఆక్వామార్ఫిక్‌ డిజైన్‌ (Aquamorphic Design) స్ఫూర్తితో ఆక్సిజన్‌ఓఎస్‌ 13ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ చెబుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముగ్గురు వ్యక్తుల కోసం ఇద్దరి నియంతృత్వ పాలన..!

పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు దిగింది. నేటి నుంచి పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో ఈ నిరసనలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు సీనియర్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. విపక్షాలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోన్న తీరు నియంతృత్వ పాలన ప్రారంభాన్ని సూచిస్తోందని రాహుల్ మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉపరాష్ట్రపతి ఎన్నిక.. మార్గరెట్‌ ఆళ్వాకు తెరాస మద్దతు

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాకు మద్దతివ్వాలని తెరాస నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం తెరాసకు చెందిన 16 మంది ఎంపీలు మార్గరెట్‌ ఆళ్వాకు ఓటు వేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వైకాపా ఎమ్మెల్యేలను కాలర్‌ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు: చంద్రబాబు

పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టాలనుకుంటే రాష్ట్రంలోని 5 కోట్లమంది పైనా పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాల్లో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలతో వైకాపా ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని చెప్పారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలోని వేపనపల్లి ‘విద్యాదీవెన’పై ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇంజినీరింగ్‌ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హుజూరాబాద్‌లో మళ్లీ ‘పొలిటికల్‌ హీట్‌’.. బహిరంగ చర్చకు వచ్చిన కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కింది. అధికార తెరాస, భాజపా నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన తెరాస ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి.. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాకు వచ్చారు. ఆయన వచ్చిన కాసేపటికి భాజపా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని