Paytm down: దేశవ్యాప్తంగా పేటీఎం సేవలకు అంతరాయం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పేమెంట్‌ ప్లాట్‌ఫాం పేటీఎం (Paytm) సేవలకు శుక్రవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. పేటీఎం యాప్‌, వెబ్‌సైట్‌ వినియోగదారులు పేమెంట్‌ సమయంలో అవాంతరాలు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తింది. దీనిపై ఫిర్యాదులు అందడంతో పేటీఎం స్పందించి సమస్యను పరిష్కరించింది.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య దేశవ్యాప్తంగా పేటీఎం సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలిసింది. పేమెంట్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు అకౌంట్‌ లాగౌట్‌ అవ్వడంతో పాటు తిరిగి లాగిన్‌ చేయడానికి ప్రయత్నించినా అవ్వకపోవడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేశారు. దీనిపై వెంటనే పేటీఎం స్పందించింది. నెట్‌వర్క్‌ ఎర్రర్‌ వల్ల అంతరాయం ఏర్పడిందంటూ ట్వీట్‌ చేసింది. మూడు గంటల తర్వాత సమస్య పరిష్కారమైందని పేర్కొంటూ మరో ట్వీట్‌ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరికైనా ఇబ్బంది తలెత్తి ఉంటే తమకు వ్యక్తిగత మెయిల్‌ చేయాలని సూచించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని