Russia: ఖైదీల మార్పిడికి సానుకూలంగా స్పందించిన రష్యా

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా, రష్యాలు పరస్పరం ఖైదీల మార్పిడిపై చర్చించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు దౌత్య మార్గాల్లో అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ శుక్రవారం వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘‘రష్యా, అమెరికా జైళ్లలో బందీలుగా ఉన్న ఖైదీలపై ప్రత్యేక మార్గాల్లో చర్చించడానికి దేశాధినేతలు (పుతిన్‌, బైడెన్‌) అంగీకరించారు. బయటకు ఎవరు ఏమి మాట్లాడినా.. ఈ మార్గం మాత్రం అందుబాటులో ఉంటుంది’’ అని లావ్రోవ్‌ పేర్కొన్నారు. 

అమెరికా జైల్లో ఉన్న రష్యా ఆయుధ డీలర్‌ విక్టర్‌ బౌట్‌ విడుదలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. సోవియట్‌ సైన్యంలో పనిచేసిన  బౌట్‌.. ఆ తర్వాత ఆయుధ డీలర్‌గా ఎదిగాడు. ఇతడిని 2008లో సినీఫక్కీలో థాయిలాండ్‌ అరెస్టు చేశారు. ఆ తర్వాత 2010లో అమెరికాకు తరలించారు. బౌట్‌ విడుదలకు ప్రతిగా తమ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి బ్రిట్ని గ్రైనర్‌ను విడుదల చేయమని అమెరికా కోరనుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ప్రముఖ అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి బ్రిట్నీ గ్రైనర్‌ను నిన్న రష్యా కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు ఖిమ్కీలోని న్యాయస్థానం జడ్జి ఆమెకు గురువారం 9 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఆమె ఫిబ్రవరిలో అరెస్టయి కస్టడీలో ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి శిక్షాకాలాన్ని పరిగణించాలని పేర్కొంటూ జడ్జి తీర్పునిచ్చారు. 31 ఏళ్ల ఆమె మాదకద్రవ్యాలను అక్రమంగా రష్యాకు తీసుకొచ్చినట్లు న్యాయమూర్తి  పేర్కొన్నారు. గూఢచర్యం కింద దోషిగా తేలి రష్యాలో జైలుశిక్ష పడిన అమెరికన్‌ పాల్‌ వెలాన్‌లను విడుదల విషయం కూడా చర్చకు రానుంది. 


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని