Komatireddy: పార్టీ నుంచి నన్ను కూడా వెళ్లగొట్టేందుకు చూస్తున్నారు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

దిల్లీ: పార్టీ నుంచి తనను కూడా వెళ్లగొట్టేందుకు చూస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. దాసోజు శ్రవణ్‌ లాంటి మేధావిని పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. తనను కూడా పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వాళ్లని బయటకు పంపించి తెదేపా వాళ్లని తీసుకొచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎవరైనా పీసీసీ అధ్యక్షుడి పక్కన ఉన్నారా?అని ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో నాకు తెలీకుండా కార్యక్రమ నిర్ణయం ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. చెరుకు సుధాకర్‌ పార్టీలో చేరే విషయం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. సోనియా, రాహుల్ గాంధీ దగ్గరే వీళ్ల సంగతి తేల్చుకుంటానని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు తెలుసని.. కానీ, ఇప్పుడే చెప్పనని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని