‘తైవాన్‌’ ప్రభావం మనపై తక్కువే: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఉద్రిక్తలు రాజేసింది. తైవాన్‌ను చైనాలో అంతర్భాగంగా భాగంగా భావిస్తూ వస్తున్న డ్రాగన్‌కు ఈ చర్య చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాలకు దిగింది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గామి వంటి వాటిని మోహరిస్తోంది. ఇది ఉక్రెయిన్‌ - రష్యా పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలూ వినవస్తున్నాయి. ఒకవేళ అలాంటిదేమైనా జరిగిన భారత్‌పై ప్రభావం తక్కువేనని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు.

తైవాన్‌తో భారత్‌ వాణిజ్యం పరిమితమేనని శక్తికాంత దాస్‌ అన్నారు. మొత్తం వాణిజ్యంలో ఈ వాటా 0.7 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. కాబట్టి భారత్‌పై ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నా అన్నారు. అలాగే ఆ దేశం నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులు (FDI) సైతం చాలా తక్కువని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతున్నా.. భవిష్యత్‌లో ఏం /జరిగినా భారత్‌పై ప్రభావం నామమాత్రమేనని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని