CWG 2022: భారత్‌కు మరో స్వర్ణం.. రెజ్లింగ్‌లో అదరగొట్టిన బజ్‌రంగ్

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఏడో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఫైనల్స్‌లో కెనడా యువ రెజ్లర్‌ మెక్‌నీల్‌పై సునాయాస విజయం సాధించాడు. ఆది నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ వచ్చిన బజ్‌రంగ్ ఫైనల్లోనూ 9-2 తేడాతో మెక్‌నీల్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో భారత్‌ ఈ సీజన్‌లో మొత్తం 22 పతకాలు కైవసం చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో అన్షుమాలిక్‌ రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.


మరిన్ని

ap-districts
ts-districts