Yogasanas: పొట్ట దగ్గర కొవ్వు కరగాలా? రోజూ ఈ ఆసనం 10 నిమిషాలు చేస్తే చాలు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక బరువు ఎన్నో చికాకులను తెస్తుంది. అనారోగ్యం ఒక్కటే కాదు.. ఏ పని చేయాలన్నా ఆయాసం, అలసట ఎదురవుతుంది. మధుమేహం, గుండెపోటు సమస్యలను తెస్తుంది. ఈ ఊబకాయం నుంచి బయట పడేందుకు వ్యాయాయంతో పాటు ఆహారాన్ని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ చిత్తశుద్ధితో యోగా చేస్తే అధిక బరువును తగ్గించుకోవటం చాలా సులువని యోగా నిపుణులు ఆర్‌ ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

పొట్ట తగ్గించుకోవడం ఇలా..: శ్రద్ధతో రోజూ 10 నిమిషాలు వీటిని చేస్తే చాలు. నౌకాసనం చేస్తే పొట్టను బాగా తగ్గించుకోవచ్చు. ఉదయం, సాయంత్రం 20 సార్లు చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సూర్యముద్రను చాలా సులువుగా చేయొచ్చు. కుర్చీలో లేదా కింద కూర్చొని కూడా చేయడానికి వీలుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయాలి. దాదాపుగా 40 నిమిషాలు వెచ్చించాలి. వీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆచరిస్తే నెలలో 3-4 కిలోలు తగ్గుతారు

ఆహారంలో మార్పులు: యోగాతో పాటు ఆహారంలో మార్పులు చేయాలి. కూరగాయలను పచ్చిగా తీసుకోవడానికి సిద్ధం కావాలి. ఆకు కూరలనే తినాలి. మంచినీటిని సమయానుకూలంగా ఎక్కువగా తీసుకోవాలి.



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని